New Bus Ticket Prices In AP: ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు
ఇంధన ధరల మంటతో సంస్థపై నిత్యం రూ.2.50కోట్ల అదనపు భారం
అనివార్య పరిస్థితుల్లోనే పెంపు
కనీస దూర ప్రయాణాలపై పెంపులేదు
సిటీ బస్సులకు మినహాయింపు
అమరావతి: డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది.
కనీస దూరం ప్రయాణానికి డీజిల్ సెస్ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్ పాస్‌లపై డీజిల్ సెస్‌ను రెండోసారి జూన్ 9న పెంచిన విషయం తెలిసిందే.
0 Comments